మల్లె తీగ

 1. నా మనసు…. దానికి నడక రాదు…. అంచేత ఎక్కడంటే అక్కడ పడుతుంది… !!!
 2. అహం అనే ఉయ్యాల, అది ఊగుతున్నవారికి మాత్రమే ఆనందాన్నిస్తుంది!!!
 3. అద్దానికే హృదయం ఉంటే, అంతః సౌందర్యం లో నీవు మహారాణివి!!!
 4. నాణానికి మరో వైపు చూస్తున్నారు వాళ్ళు, ఆ నాణెంలో ఒక ఆత్మీయ అనుబంధం నేను చూస్తున్నాను!!!
 5. సప్త సముద్రాలు దాటిన నీవు దాటవలసినది ఇంకొకటి మిగిలివుంది – ప్రేమ సముద్రం!!!
 6. मानते हैं खुदा हम पर मेहरबाँ है पर छप्पर फटने का बेसब्री से इंतज़ार है ।
 7. ఆశ ఆకాశం అంచున వేలాడుతుంది, అది అందుకోవాలంటే తాహత్తనే రెక్కలు కట్టుకోక తప్పదు మరి.
 8. గమ్యమే లేని వీటికి అలసట లేదట – సముద్రం లోని అలకి, నీవు నడిచే ఇలకి (భూమి), మరి గమ్యము ఉన్న నీకు మటుకు అది ఎందుకు?!?!
 9. మనిషికి ఉన్న వ్యసనాల లో నాకు బాగా నచ్చేది ‘స్వేచ్ఛ’. దాని జోలికి వేళ్ళను.
 10. ఆకలి యుద్ధపు పద్మవ్యూహాన్ని ఛేదించే నేర్పు ఒక్క రైతన్నకే ఉందేమో !!!
 11. అమ్మ ప్రేమను పొందే వాడు అదృష్టవంతుడైతే, ఆప్యాయంగా చూసుకునే అక్కాచెల్లెళ్లు ఉన్నవాడు అపర కోటీశ్వరుడేగా మరి!
 12. నాది నీది అని కాకుండా ‘సోదరి’ మనది అనుకున్నపుడు, నిజమైన స్వాతంత్య్రం వచ్చ్చినట్టే!!!
 13. గుండెలో లేని చిరునవ్వు పెదాలపైకి తీసుకు రాలేనని రెండు సెల్ఫీలు తీసుకున్నాక గానీ తెలియలేదు!!!
 14. నాకు ఇష్టమైనది కొన్నాక ఒక ఆలోచన లో పడ్డా. కొన్న కోరిక తీరిన నేను గెలిచానా? లేక కోరిక నన్ను గెలిచిందా?!?!
 15. మహానగరం లో ఆటోవాడు స్పీడున్నోడు, దిల్లున్నోడు. అడగకుండానే నాకు కావాల్సిన address చెప్పినప్పుడు నాకు తోచిన తొలి మాట.
 16. అద్ధం, అర్ధాంగి రెండిటి మధ్య ఒక బంధం ఉంది – అద్దం నీ బాహ్య సౌందర్యం మెరుగులు దిద్దడానికి దోహద పడితే అర్ధాంగి (భార్య) నీ అంతః సౌందర్యం చెదిరి పోకుండా చూస్తుంది.
 17. చేజారిన క్షణం తిరిగి తెచ్చ్చే ప్రయత్నం లో తనని తాను తిరిగి తెచ్చుకున్నాడు…..
 18. పడి లేచే గుణం – బంతి కి, నరికిన ప్రతి సారి చిగురించే చెట్టుకి, ఓటమి తో కొత్త ఊపు పొందే మనిషికి!!!
 19. ఆశయం ఆకాశమంత దగ్గరగా ఉంటుంది. అందుకుంటే పోలా?!.
 20. కోరికలనే రోడ్డు కి dead-end ఉంటే అక్కడ నుండి నాకు ఒక phone కొట్టు please!
 21. అతడి ఉనికిని వెతుక్కుంటూ ఆమె కాలం వైపుకి పరుగులు తీసింది.
 22. దేవుడు – వరాల సంగతేమో గాని ప్రసాదం ఇస్తాడు ముందు. లాభం లేదు ఈ సారి గట్టిగా try చేయాలి.
 23. నిన్నటి వరకు స్మార్టు ఫోనులను కసురుకున్న ఆ photographer ఇప్పుడు సెల్ఫీ కర్ర కేసి చూస్తుండిపోయాడు, తన పొట్ట నిమురుకుంటూ!
 24. ఆశ – చౌరస్తా దగ్గర ఎవరైనా రోడ్డు దాటిస్తే బాగుండు అంటూ దిక్కులు చూస్తున్న అవ్వ కళ్లజోడు పై ఒక పొరలా కనిపించింది.
 25. స్వయంకృషి అనే సొంత ఇంటికి గదులు చిన్నవి, వసారా పెద్దది, సంతృప్తి అనంతం – కాబట్టి బ్రహ్మాండంగా బతికేయొచ్చు.
 26. డాబా ఎక్కిన పిల్లవాడి చేతి లో వాళ్ళ నాన్న చిన్నప్పుడు వేసిన painting. కొండల నడుమ ఉదయిస్తున్న సూర్యుడిది. గట్టు పక్కన చెట్టు మీద ఒక పక్షి గూడు. అప్పుడే గుడ్డు పొరని చీల్చుకొచ్చిన పిల్లని అక్కున చేర్చుకున్న తల్లి పక్షి. పెయింటర్ అయిపోదామనుకున్నాడు కాబోలు. పిల్లాడు చుట్టూ చూసి పోల్చుకున్నాడు. పెద్ద పెద్ద భవంతులు, అరకొరగా ఉదయిస్తున్న సూర్యుడు. చూరు నుండి కింద పడి పగిలిన గుడ్డు ని దిగాలుగా చూస్తున్న తల్లి పక్షి. Something is missing!!! ప్రకృతి సహజంగా లేదు! Do you agree???
 27. ‘Talent’ alone is often just a ‘stray dog’; when combined with luck can be found in villas.
 28. వాడు ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు – పండు ఎదురుకుండానే ఉంది. అది కదిలి వీడి దగ్గరికి రాదు. వీడు ఉన్నచోటు నుండి లేవడు. ప్రయత్నము అంటే ఏమిటి అసలు?
 29. నీలి తెర మీద మబ్బుల రగ్గులు కొద్దిగా పక్కకు జరిపి సూర్యుడు బద్ధకంగా తొంగి చూస్తున్నాడు ఇవాళ..
 30. సుఖాలలో మనిషి మబ్బులలో తేలితే, కష్టాలు మబ్బులలోని నీటి తో పాటు మనిషిని కిందకు దింపి (క)నీళ్ల లో ఈదేట్టు చేస్తాయి. But అక్కడే ధైర్యమనే సూర్యుడు hero లా entry ఇచ్చేస్తాడు, sometimes!
 31. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న ప్రకృతి, మనం చేసే ప్రయత్నాలు ఫలించడంలేదని, తనకు తానే శుద్ధోదక స్నానం చేసినట్టుంది. కొన్ని దశాబ్దాలుగా పట్టిన మురికి పోవాలంటే కొన్ని వారాలైనా శుద్ధి చేసుకోక తప్పదు.
 32. చెట్టుకు అల్లుకున్న తీగను చూస్తే అనిపిస్తుంది – అల్లుకుపోవాలి, పైకి ఎదగాలి – మనుషులతో, జీవితంలో. Achievement is glorious and a non-stop journey!
 33. ఎడారి లాంటి మనస్తత్వాలు, ఎంత ప్రేమ కురిపిస్తే తడుస్తాయి?
 34. గుండెలో తిష్ట వేసుకుని ఉన్నవాళ్లే ఆప్తులు. మిగతావారంతా కళ్ళ మసక తీరే లోపే మాయమైపోతారు.
 35. మన సాంకేతిక అభివృద్ధి పోయిన వారం బోరు బావి లోకి మెల్లగా జారిపోయింది.
 36. మనిషి బాధను కొలిచే సాధనం ఉంటే దానిని ఏమని పిలిచేవారో?
 37. జారడం – అనగానే వెంటనే తోచేది – పతనం – ఎవరి అర్ధం వారిది, ఎవరి అనుభవం వారిది. అది ఒక జారుడుబల్లా? జలపాతమా? ఒక మంచు కొండా? బురద లోనా? ప్రేమ లోకా? ఇంకా ఎన్నో….. ప్రస్తుతానికి నాదొక వింత అనుభవం!!! Take it easy!
 38. స్వేచ్ఛ, ఆలోచన – ఒకటి తూర్పు ఒకటి పడమర – కలవవుగా ! Mr. సూర్య is still trying, each day each morning. All the best!
 39. విధి’ వ్యాయామశాల – ఎప్పుడూ busy busy… అంతా గజిబిజి, అంచేత కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామ్…మరి ఎప్పుడు కలుద్దామ్!!!
 40. ఇంట్లోనే ఉన్నా, కలుద్దాం అన్నాడు. వెళ్తే కానీ అర్ధం కాలా ‘కష్టం’ లో ఉన్నాడని. మా చెడ్డ మోమాటం వెధవకి!
 41. సుఖంగా ఉన్నావని మురిసే లోపు కష్టం కాకి లా వస్తుంది. వస్తూ బోల్డు కాకుల్ని తోడు తెచ్చుకుంటుంది, తెలుసుగా! Beware!
 42. చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న ఒకామెను బతికించేందుకు Doctor తన వంతు కృషి చేస్తున్నాడు. ఇక చేసేది ఏమి లేక అని చేతులెత్తేస్తున్నాడు. ఇంతలో ఆమె కంటి నుండి జాలువారుతున్న నీటిని చూసి shock అయ్యాడు. ఆగిపోయిందనుకున్న గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది. ఎం జరిగిందో తెలియలేదు. (ఒక్క క్షణం క్రితం ఆమె పాప – ‘అమ్మా, ఆకలేస్తోందే!’ అని ఆమె చెవిలో అనడం ఎవరూ వినలేదు, బహుశా!) ఓ తల్లీ, నీకు జోహార్! – శ్రీమనశ్వి
 43. ఆశలు మనవి, ఆశయాలు మనవి,
  కలసి ఒక చక్కని జీవితాన్ని పంచుకుందామనుకున్న ఊసులు మనవి,
  ఇరువురి కనులలో నింపుకున్న ఎనలేని రంగుల కలలు మనవి
  ఒకరికొకరు చేసుకున్న బాసలు మనవి,
  ఒకరినొకరు అర్ధం చేసుకోగల ఆలోచనలు మనవి
  బంధానుబంధాలలో ఇమిడిపోయి కలకాలం ‘ప్రేమతో’
  నా మనసున నిండాలని చేస్తున్నా ప్రేమతో
  నీకు ‘మనవి’!
 44. వృద్ధాప్యం దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. జీవన పరుగు ప్రయాణం లో చూడలేకపోయిన దృశ్యాలను మనవళ్లు మనవరాళ్ల లేలేత నవ్వులలో, చేష్టలలో చూసుకు అవకాశం కలిపించే ఒక ‘rewind’ button. ఈ బటన్ ఆ దేవుడు జీవులన్నిటికీ ఇవ్వలేదని నా నమ్మకం.
  – శ్రీమనస్వి
 45. ‘శక్తి’ సామర్ధ్యాలు ఈశ్వరునికి ఏనాడో ఎరుక. సగమేనాడో వదిలి, పురుష జాత్యహంకారానికి ఎప్పుడో తేర పడిపోయింది. మనమెంత!
Advertisements
%d bloggers like this: