Sai – the Omnipotent

18 వ శతాబ్దం ఆవిర్భావం భారత దేశ ఉపఖండం చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సూర్యోదయాన్ని చూసింది. భరత జాతి కానీ విని ఎరుగని రీతిలో మానవాళికి మానవ జన్మ ప్రాముఖ్యతని చాటుతూ దివి నుండి భువి కి దిగిన మహామహిమాన్విత శ్రీ షిరిడి సాయి నాథుని పదకమల స్పర్శ తో షిరిడి గ్రామము పులకించినది.
దేవుని జననము ఎవరికి ఎరుక. సాయి నాథుని జననము, వారి జీవితమునకు సంబంధించిన ఎటువంటి విశేషాలు షిరిడి ప్రజలకు తెలియనప్పటికీ, ఆ మహానుభావుడిని పూజించి చరిత్ర లో ఘన కీర్తిని ఆర్జించింది ఆ షిరిడి గ్రామము. చిరిగిన కఫిని, చేతిలో ఒక సటక, తేనెలొలికే పలుకులు, ఏడూ జన్మల బాధలని ఒక్క స్పర్శ తో రూపు మాపగలిగే ఆ కరుణామయుడు ఎందరికో ఇలవేల్పుగా వెలుగొందాడు.
నాటికి, నేటికి ఏనాటికైనా సాయి నాథా, అనగానే నేనున్నా అంటూ భక్తుల బాధలు కడ  తేర్చి వారి జీవితాలని సంతోషమయం చేసే అమృత మూర్తి ఆ షిరిడి సాయి నాథుడు ఒక్కడే, కాక ఇంకవ్వరు!
జాతి, కుల, మత, వర్ణ విభేదాలకు అతీతంగా శరణు వేడిన వారిని అక్కున చేర్చుకుని వారి కుటుంబం లో ఒకడు గామారి వారి సంతోషాలలో తన సంతోషం చూసుకుంటూ ‘అల్లా మాలిక్’ అంటూ జనులందరూ ఒక్కటే! సర్వాంతర్యామి ఒక్కడే అని చాటాడు.
నీటితో దీపాలు వెలిగించినా, భక్త భిమాజి క్షయ వ్యాధి నిర్ములించినా, అంతలోనే  చిన్న పిల్లాడిలా వంకాయ కూర ఆరగించిన ప్రేమస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపనికే చెల్లింది.
ఒక హిందువై శ్రీ రామ నవమి పండుగని జరిపించి, ఒక ముస్లిమై మసీదులో జీవనం సాగిస్తూ, జనులందరికి ‘సబక మాలిక్ ఏక హై’ అని నిరూపించాడు ఆ సాయి తండ్రి.
అశాశ్వతమైన ఈ శరీరాన్నే విడుస్తున్నా గాని  ఎల్లప్పుడూ మీతోనే ఉంటాననే తన పలుకులను నిజం చేస్తూ ప్రతి జీవ రాశి లోనూ తన ఉనికి చాటుతున్నాడు శ్రీ షిరిడి సాయి నాథుడు. నేడు షిరిడి గ్రామము భారత దెశ ఉపఖండం లోనే మహా పుణ్య క్షేత్రం గా వేలోగొన్దుతు భక్తుల కోరికలని నేరవేరుస్తున్నది.
శ్రీ సాయి నాథుని దర్శన భాగ్యం కలగాలని కోరుతూ, వారి కరుణ కతక్షములు మీ పై మీ కుటుంబం పై ఎల్లా వేళల ఉండాలని ఆశిస్తు – సెలవు

ఓం శ్రీ సాయి నాథాయ నమః

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s