Coffee @ Bheema’s – Twist

భీమాస్ కి చేరే లోపు….

“Curtains పాతబడిపోయాయోయ్. ఒక అర dozen కొని పారేద్దాం.” – గోపి (రోడ్డు మీద వెళ్తూ, కంటికి ఏదన్నా కనపడడం పాపం, తెచ్చి ఇంట్లో పెడదాం అనుకునే రకం.

“అలాగే ఒక రెండు bed-sheets కూడా.” – స్మిత (భర్త idea కి తన idea అనుసంధానం చేస్తే గానీ నిద్దరట్టదు)

“సర్ సర్లే, ఎన్నో అనుకుంటాం. Next month చూద్దాం లే.” (ఇంతోటి దానికి కొనడం అనే ప్రసక్తి ఎందుకు తేవాలి?)

“ఇక్కడ ఒక pizza షాప్ ఉండాలి. పోయిన సారి ‘స్త్రీ దినోత్సవం’ అంటూ రాత్రి పూట సరదాగా ఒక అరగంట ఇక్కడ గడిపాం అవి ఇవి తింటూ, నీకు గుర్తుందా?” – గోపి

స్మిత దగ్గర నో response. ఏదో ఆలోచన లో ఉంది కాబోలు. ఇది మనోడికి మామూలే. నిజానికి, స్మిత అప్పుడప్పుడు ఐతే, మనోడు ఎల్లప్పుడూ ఊహాలోకం లోనే విహరిస్తూ ఉంటాడు.

సరే, మొత్తానికి చేరారండి భీమాస్ కి.

“Brother, రెండు strong కాఫీ చెయ్యి.” bill pay చేస్తూనే కాఫీ తయారు చేసే అబ్బాయికి ఆర్డర్ వేసాడు. చూపులు మట్టుక్కూ, అదేదో “మెన్ will be మెన్” ad లో లాగా ఏటో పాతుకున్నాయి.

“ఇక్కడ నిలబడి తాగేద్దాం.”, అన్న స్మిత మాటకు ఠక్కున,”అబ్బే, ఎంచక్కా లోపల కూర్చుని తాగుదామోయి. బయట ఒకటే dust కదా!” అన్నాడు గోపి లోపలి నడుస్తూ. తన వెనుకే స్మిత కూడా వెళ్ళింది.

“The essence of pleasure is spontaneity.” అన్నాడు Germaine Greer.

కాఫీ ఆస్వాదిస్తూనే పక్క table కేసి చూసాడు గోపి. రెండు కళ్ళు నిన్ను కూడా చూస్తున్నాయి అన్నట్టు,”చిత్త కార్తె ఎప్పుడండీ?” మర్యాదగా అంటించింది స్మిత.

“ఎప్పుడోలే, ఇప్పుడెందుకు ఆ గొడవ? కాఫీ భలే ఉంది కదు.” అంటూ టాపిక్ మార్చే వృధా ప్రయత్నం చేసాడు గోపి.

జీడీ పాకం సాగింది. “ఇంట్లో కూరలు లేవ్. అవ్వేమి పట్టవు.” అన్న స్మిత మాటల ఘాటుకి కాఫీ కొంచెం కారంగా అనిపించింది గోపికి. “వెళ్లేప్పుడు తీసుకెళదాం లే.” అన్నాడు చూపులు స్మిత వైపు బలవంతంగా తిప్పుకుంటూ. (అన్నట్టు మూడు సిప్పులకే అయిపోయిన కాఫీని కూడా తిట్టుకున్నాడు.)

“ఈ మధ్య కాఫీ గ్లాసు size తగ్గించేస్తున్నారు, వెధవలు.” అన్న గోపి మాటలకి బదులుగా స్మిత ఏదో అనబోతుండగా…..

‘మీరు లేస్తే మేము కూర్చోవాలి’ అన్నట్టుగా already ఇద్దరు plates చేత్తో పట్టుకుని table పక్కనే నుంచుంటే ఇబ్బందిగా అనిపించి, కాఫీ గ్లాసు టేబుల్ మీద పెట్టి ఇక వెళదాం అన్నట్టుగా సైగ చేస్తూ లేచాడు గోపి.

స్మితకు కాసేపు కూర్చుందామని ఉన్నా,”సరే.” అంటూ బయలుదేరింది.

బైక్ కొద్దిసేపటికే వాళ్ళ కాలనీ లోకి చేరింది. ఇంతలో ఒక వింత అనుభవం ఇద్దరికీ.

“అతనికి ఏమన్నా సాయం చెయ్యవలసిందేమో!” అంటున్న స్మిత కంఠం లో స్వరం విన్న గోపికి అర్ధం అయింది, సున్నితమైన మనస్సు కలిగిన ఆడవారు దేనిని తట్టుకోలేరని. ఐదు నిమిషాల క్రితం …..

తాను అంగవైకల్యం తో బాధ పడుతున్నా కుటుంబ పోషణ ఏ మాత్రం మరువని తండ్రి ఆతృత. ఇద్దరు ఆడ పిల్లలు (7 లేక 8 ఏళ్ల వయస్సుంటుందేమో) తన మూడు చక్రాల బండిని వెనుక నుండి తోస్తుంటే, చిన్నవాడైన కొడుకు తన కాళ్ళ దగ్గర ఇరుక్కుని ఆకలికి నీరసించి కునుకు తీస్తుండగా, సరుకుల సంచిని ఒక చేత్తో పట్టుకుని, మరొక చేత్తో తన వాహనాన్ని control చేస్తూ….”.

ఈ దృశ్యం అంత బైక్ మీద ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న గోపి స్మితల కంట పడింది. కేవలం 10 సెకనుల వ్యవధి లో… ఆహ్లాదకరమైన సంభాషణ భావోద్వేగాలలో కలిసిపోయింది.

“పేద వాళ్ళు ధనికులు కాక పోయిన అభిమాన ధనులు అయి ఉండొచ్చు. సాయం చెయ్యాలనే ఉంది కానీ అతను తన అంగవైకల్యాన్ని అవహేళన చేస్తున్నామేమో అని, అనవసర జాలి చూపిస్తున్నామేమోనని ఇబ్బంది పడితే?” ఇలా తన మనసు లోని మాటలను స్మిత తో అన్నాడు.

“ఆ పిల్లల మొహాలు మర్చిపోలేక పోతున్నానండి.” స్మిత బాధ వర్ణనాతీతం. తల్లిని పోగొట్టుకున్న బాధ స్మిత మనస్సును మరింత సున్నితంగా మార్చేసిందని గోపి ఏనాడో తెలుసుకున్నాడు. “ఒక్కసారి పక్కకు ఆపండి.” బండి పక్కకు ఆగగానే స్మిత అక్కడున్న కిరాణా shop లోకి వెళ్ళింది ఏదో సరుకు కొనాలంటూ.

స్మిత అటు వెళ్ళగానే, గోపి వెంటనే ఆ తండ్రి వెళ్తున్న మార్గం లో byke పరుగులు తీయించాడు. ఆ తండ్రీ కూతుళ్లు కనపడగానే బండి ఆపి వాళ్ళ దగ్గరకి వెళ్లి,” బాబూ, ఎం చేస్తుంటావ్. ఎక్కడ నుండి వస్తున్నావ్.” అంటూ వివరాలు అడిగాడు.

“ఏం లేదు సారూ, సంతకి పోయి కూరగాయలు తెచ్చుకుంటున్నా. బిచ్చమెత్తుకుని బతుకుతున్న సారూ. వీళ్లు నా బిడ్డలు. ఇంటికి బోయి వండుకుని తినాలె.” అతని మాటల్లో ఇల్లు ఇంకా కనీసం రెండు కిలోమీటర్లన్నా ఉంటుందని తెలుసుకున్నాడు గోపి. కష్టాన్ని చాలా ఇష్టంగా మోస్తున్నాడు ఆ తండ్రి.

గోపి ఏదో ఆలోచనలో పడ్డాడు. అతను నెమ్మదిగా వెళ్ళిపోబోతుండగా గోపి వెంటనే తేరుకుని అతనిని ఆపి తన వద్ద ఉన్న ఒక 500 కాగితం చేతిలో పెట్టి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఆ తండ్రి కూడా ఊహించని ఈ చర్యకి విస్తుపోయాడు.

ఒక వింత అనుభవం ఇద్దరికీ. ఆ తండ్రికి ఇంకా గోపీకి. ఎవరికీ ఎవరో, ఎవరెవరో అన్నట్టు ‘సహాయం’ చెయ్యటం, అందుకోవడం ఇద్దరికీ వింతే!

“సంతోషం సారూ.” అతని నోటి వెంట వచ్చిన రెండు మాటలు. అనాయాసంగా, pant జేబులో మొబైల్ చేతికి తగిలింది. (Office phone మాట్లడుతూ బయల్దేరాడు ఇంటి నుండి, ఉండి పోయినట్టుంది). ఒక selfie తీసుకున్నాడు గోపి. గొప్ప కోసం కాదు. స్మిత కోసం, స్మిత మనస్సు కుదుట పడడం కోసం.

“ఎక్కడికి వెళ్లిపోయావ్ గోపి?” ఆదుర్దాగా అడిగింది స్మిత. “ఇదిగో చూడు. To see you happy.” అంటూ తానూ తీసుకున్న సెల్ఫీ చూపంచాడు.

“I love you, Gopi. మనం బయటకు వచ్చిన purpose ఇదేనేమో బహుశా!” అంటూ గోపీని అల్లుకుపోయింది స్మిత.

But తన స్థాయికి మించిన ఆలోచన చెయ్యలేక పోయానని, చేసుంటే ఒక కుటుంబం బాగు పది ఉండేదేమోనన్న బాధ ఆ రాత్రి గోపికి నిద్ర పట్టనివ్వలేదు.

ఏం జరుగుంటుంది తరువాత?!?….

మీ

శ్రీమనస్వి

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.